" మనిషన్నాక తన జీవితం లో ఎన్నో విషయాలు ఎన్నో సంగటనలు జరిగి ఉంటాయి.అందులో ఆనందకరమైనవి జరిగి ఉంటాయి భాదాకరమైనవి ఉంటాయి ." నా జీవితం లో జరిగిన వాటిల్లో కొన్ని మీ కోసం ..
నేను పుట్టి ఈ నేల ఫై పడ్డ క్షణం నుండి ఇప్పటి దాక నేను కొన్ని లక్షల మందిని చూసి ఉంటాను ,నన్ను కూడా కొన్ని లక్షల మంది చూసి ఉంటారు.కాని ఆ లక్షల మందిలో నేను చుసిన మొదటి వ్యక్తి అమ్మ .నాకు మాటలు వస్తునపుడు నేను అన్న మొదటి పదం " అమ్మ " .నాకు ఆకలేసినప్పుడు నా ఆకలి తీర్చింది కూడా అమ్మే .తరువాత నాకు తెలిసిన రెండో వ్యక్తి మా " నాన్న " .నా తల్లిని నేను ఎంత ప్రేమించానో నా తండ్రిని కూడా నేను అంతే ప్రేమించాను .నాకు ఇద్దరు సమానమే.ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు.నేను పుట్టాక నేను చుసిన మూడో వ్యక్తి అన్నయ్య .నాకు మా అన్నయకు నాలుగు ఏళ్ళు తేడా ఉంది కాని మేము స్నేహితుల లాగే పెరిగాము .మా మధ్య ఎపుడు భేదాబిప్రాయలు ఉండేవి కావు .ఇక నా వ్యక్తిగత జీవితం లోకి వెళ్తే ఎన్నో మలుపులు కనిపిస్తాయి.నా ఈ జీవిత ప్రయాణం లోని కొన్ని అనుభవాలు మీకోసం రాస్తున్న. నా ఈ ఇరవైఒక్కేల్ల ప్రయాణం నాకు ఎన్నో నేర్పించింది.ఎప్పటికైనా నేను యి సమాజాన్ని గుర్తుపెట్టుకునేల నే కాకుండా నన్ను కూడా యి సమాజం గుర్తుపెట్టుకునేల గౌరవంగా బ్రతకమని చెప్పింది నా కుటుంబం.చిన్నపుడు ఆటలు ఆడుకునే వయసులో నాకనె కాదు ఎవ్వరికి అవి అర్ధంకావు.కాని జీవిత ప్రయాణం లో ఎదిగే కొద్ది మనకి అవి అర్ధమవ్తాయి.నాకు కూడా అంతే ఆడుకునే వయసులో అవి ఎం అర్ధం కాలేదు.కాని నేను ఆడుకునే వయసులో ఉన్నపుడే మా ఇంట్లో జరగ కూడనిది ఒకటి జరిగింది ,నాకు పదేళ్ళ వయసపుడు మా అమ్మ మమ్మల్ని వదిలి పెట్టి పైలోకానికి వెళ్లిపోయింది.మా అమ్మ చనిపోయాక మా ముగ్గురి జీవితాలు చీకటిగా మారిపోయాయి. మా అమ్మ ని ప్రాణం కన్నా ప్రేమించేయ్ మా నాన్న ఎంత కుమిలిపోయరో నా కళ్లారా చూసాను కాని నేను ఏమి చెయ్యలేక పోయాను ఎందుకంటే నా వయసుకి ఆ ప్రేమలు బాధలు ఎం తెలియవు అప్పుడు..
నా గురించి చెప్పాలంటే అబ్బో చాల ఉన్నాయి.నాకు ఊహ తెలిసినప్పటి నుండి నన్ను నాకు నేనుగా చాల మారాను .అందరి లాగ ఏదో పోగొట్టుకున్నోడిలా ఉండటం నాకు నచ్చలేదు అందుకే ఎపుడు నవ్వుతు అందర్ని నవ్విస్తూ ఉండటం అలవాటు చేసుకున్న.ముందు నాకు స్నేహితులు తక్కువ కాని అల ఉండటం మొదలు పెట్టక అందరు నాకు దెగ్గర అవ్వడం మొదలు పెట్టారు.అది నాకు నచ్చింది .
